చీఫ్‌ సెక్రటరీని జైలుకు పంపుతాం.. ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-06-25T18:03:04+05:30 IST

పనులను నిలిపివేయాలని ఎన్‌జీటీ గతంలో తీర్పు ఇచ్చినా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ వాసి గరిమళ్ల శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు.

చీఫ్‌ సెక్రటరీని జైలుకు పంపుతాం.. ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక

ఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్‌జీటీలో ఇవాళ విచారణ జరిగింది. పనులను నిలిపివేయాలని ఎన్‌జీటీ గతంలో తీర్పు ఇచ్చినా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ వాసి గరిమళ్ల శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్జీటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తీర్పును ధిక్కరించి పనులు కొనసాగిస్తే.. చీఫ్‌ సెక్రటరీని జైలుకు పంపుతామని హెచ్చరించింది. పనులను నిలిపివేసి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని ఎన్‌జీటీకి ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వ వాదనలపై అనుమానాలు వ్యక్తం చేసింది ఎన్‌జీటీ. రాయలసీమ పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని.. కేఆర్‌ఎంబీ, పర్యావరణ శాఖలకు ఎన్‌జీటీ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది. 



Updated Date - 2021-06-25T18:03:04+05:30 IST