విద్యార్థుల కోసం ఎన్‌హెచ్‌ఆర్‌డీ

ABN , First Publish Date - 2020-11-21T07:46:28+05:30 IST

విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలను పెంచడానికి నేషనల్‌ హెచ్‌ఆర్‌డీ నెట్‌వర్క్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌డీ), హైదరాబాద్‌ చాప్టర్‌ ‘గెట్‌ సెట్‌ గో-మెంటార్‌ ఎట్‌ క్యాంపస్‌’ ప్రత్యేక పథకాన్ని చేపట్టింది

విద్యార్థుల కోసం ఎన్‌హెచ్‌ఆర్‌డీ

‘గో-మెంటార్‌ : క్యాంపస్‌’ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలను పెంచడానికి నేషనల్‌ హెచ్‌ఆర్‌డీ నెట్‌వర్క్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌డీ), హైదరాబాద్‌ చాప్టర్‌ ‘గెట్‌ సెట్‌ గో-మెంటార్‌ ఎట్‌ క్యాంపస్‌’ ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల్లో  ఉద్యోగార్హత నైపుణ్యాలను మెరుగు పరచడానికి స్వచ్చందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎన్‌హెచ్‌ఆర్‌డీ, హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ ఉడుముల శ్రీనివాస్‌ రెడ్డి  తెలిపారు. సరైన రెజ్యుమో తయారు చేయడం, ఇంటర్న్‌షిప్‌, ఇంటర్వ్యూకు సిద్ధం అవడం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు వంటి అనేక విషయాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని, నైపుణ్యాలను పెంచాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానంలో ఉన్న మానవ వనరుల ఉద్యోగులు దాదాపు 100 మంది విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు.


ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా కాలేజీల్లో విద్యార్థులతో లెర్నింగ్‌ సర్కిళ్లు, క్లబ్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ముందుగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వంటి 10 మేనేజిమెంట్‌ విద్యా సంస్థలతో అవగాహన ఒప్పదం కుదుర్చుకున్నామని ఎన్‌హెచ్‌ఆర్‌డీ, హైదరాబాద్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సూరంపూడి శ్రీకాంత్‌ తెలిపారు. మొదటి దశలో భాగంగా మొత్తం 30 ఎంబీఏ కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. 5,000-7,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 

Updated Date - 2020-11-21T07:46:28+05:30 IST