Abn logo
Aug 5 2021 @ 16:47PM

వివాదంపై స్పందించిన నిహారిక భర్త చైతన్య

హైదరాబాద్: అపార్ట్‌మెంట్‌లో జరిగిన వివాదంపై సినీ నటి నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య స్పందించారు. అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవపై ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. తనపై కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయని, కానీ తానే ముందుగా ఫిర్యాదు చేశానని చైతన్య చెప్పారు. దాదాపు పాతికమంది వచ్చి తమ డోర్ కొట్టడంతో తానే ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫ్లాట్ ఓనర్‌కు, అపార్ట్‌మెంట్ వాసులకు మధ్య మిస్ కమ్యూనికేషన్‌ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. ఫ్లాట్‌ను రెంట్‌కు తీసుకున్న పర్పస్ గురించి తాను ఓనర్‌కు తెలియజేశానని, ఆ విషయం అపార్ట్‌మెంట్ వాసులకు తెలియకపోవడం వల్లే గొడవకు వచ్చారని చెప్పారు. ఇరువురు మాట్లాడుకుని చర్చించుకున్నామని తెలిపారు. తాము కమర్షియల్ ఆఫీసుగా వాడుకోవడం మిగతా ఫ్లాట్ వాళ్లకి ఇబ్బందికరంగా ఉందని చెప్పారని, అందుకే తాము ఈనెల 10న ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని చైతన్య వెల్లడించారు.