నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ!

ABN , First Publish Date - 2020-07-08T04:34:24+05:30 IST

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎన్నికల సంఘం కమిషనర్‌గా కొనసాగించాలని...

నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ!

అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎన్నికల సంఘం కమిషనర్‌గా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం కోర్టు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


కాగా కరోనా నేపథ్యంలో ఏపీలోని పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తూ అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనను ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. తనను ఎస్ఈసీగా కొనసాగించాలని హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకే తీర్పు అనుకూలంగా వచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రెండోసారి పిటిషన్ దాఖలు చేసింది. 

Updated Date - 2020-07-08T04:34:24+05:30 IST