నిజామాబాద్ జిల్లా: మాక్లూర్ మండలం, మాదాపూర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దీంతో మాదాపూర్ గ్రామ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుతను బంధించాలని విజ్ఞప్తి చేశారు. సింగరాయిపల్లిలో ఇప్పటికే రెండు దూడలపై చిరుత దాడి చేసి హతమార్చడంతో రాత్రివేళ బయటకు వెళ్లాలంటే స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. రైతులు, పశువుల కాపర్లు పొలాల వైపు వెళ్లేందుకు జంకుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత జాడ కోసం ప్రయత్నిస్తున్నారు.