Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీ20 ప్రపంచకప్ 2021 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత ఆటగాళ్లలో ఒక్కరికీ దక్కని చోటు

దుబాయ్: టీ20 ప్రపంచకప్ నుంచి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన భారత జట్టుకు మరో అవమానం ఎదురైంది. ప్రపంచంలోనే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి, అత్యుత్తమ జట్టుగా పేరుగాంచిన భారత జట్టులోని ఒక్కరంటే ఒక్క ఆటగాడికి కూడా ఐసీసీ తాజాగా ప్రకటించిన ‘అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యుబుల్ టీం ఆఫ్ ది టోర్నమెంట్’లో చోటు లభించలేదు. అత్యుత్తమ ఫామ్‌తో ఇరగదీస్తున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను ఈ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది.


టైటిల్ విజేత జట్టు ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, సౌతాఫ్రికా జట్ల ఆటగాళ్లకు ఐసీసీ అత్యుత్తమ జట్టులో స్థానం లభించింది. ఆస్ట్రేలియా నుంచి ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, లెగ్ స్పిన్నర్ ఆడం జంపా, సీమర్ జోష్ హేజిల్‌వుడ్‌కు చోటు లభించగా, వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ కీపర్ జోస్ బట్లర్‌ను ఎంచుకుంది. ఇక, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను ఈ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించిన ఐసీసీ.. న్యూజిలాండ్ లెఫ్టార్మర్ ట్రెంట్ బౌల్ట్, శ్రీలంక స్టార్ వనిందు హసరంగకు చోటు కల్పించింది.   


 ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టు: డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), జోస్ బట్లర్, వికెట్ కీపర్ (ఇంగ్లండ్), బాబర్ ఆజం, కెప్టెన్ (పాకిస్థాన్), చరిత్ అసలంక (శ్రీలంక), మార్కరమ్ (సౌతాఫ్రికా), మొయీన్ అలీ (ఇంగ్లండ్), వనిందు హసరంగ (శ్రీలంక), ఆడం జంపా (ఆస్ట్రేలియా), జోస్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), అన్రిక్ నార్జ్ (సౌతాఫ్రికా). 12వ ఆటగాడిగా షహీన్ అఫ్రిది (పాకిస్థాన్)ను తీసుకుంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement