క్యూఆర్‌ కోడ్‌ లేకున్నా నో జరిమానా: సీబీఐసీ

ABN , First Publish Date - 2020-12-01T06:27:28+05:30 IST

జీఎ్‌సటీ చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో ఊరట ప్రకటించింది. బిజినె్‌స 2 కన్స్యూమర్‌ (బీ2సీ) లావాదేవీల్లో వ్యాపార సంస్థలు జారీ చేసే ఇన్వాయిస్‌లపై క్యూఆర్‌ కోడ్‌ లేకపోయినా వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి జరిమానా భారం ఉండదు...

క్యూఆర్‌ కోడ్‌ లేకున్నా నో జరిమానా: సీబీఐసీ

న్యూఢిల్లీ: జీఎ్‌సటీ చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో ఊరట ప్రకటించింది. బిజినె్‌స 2 కన్స్యూమర్‌ (బీ2సీ) లావాదేవీల్లో వ్యాపార సంస్థలు జారీ చేసే ఇన్వాయిస్‌లపై క్యూఆర్‌ కోడ్‌ లేకపోయినా వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి జరిమానా భారం ఉండదు. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ (సీబీఐసీ) ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయి తే వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇన్వాయిస్‌లపై తప్పనిసరిగా క్యూఆర్‌ కోడ్‌ పాటించే సంస్థలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. జీఎ్‌సటీని మరింత పటిష్టం చేసేందుకు డిసెంబరు 1 నుంచి బీ2సీ లావాదేవీల ఇన్వాయిస్‌లపై క్యూ ఆర్‌ కోడ్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేయడం పెద్ద ఇబ్బందని వ్యాపార, వాణిజ్య వర్గాలు ఫిర్యాదు చేయడంతో మార్చి వరకు ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Updated Date - 2020-12-01T06:27:28+05:30 IST