Abn logo
Aug 22 2021 @ 01:04AM

నాలుగోసారి మారింది!

కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చిత్రాల విడుదల తేదీలు మారాయి. అందుకు జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంఛైజీలో ‘నో టైమ్‌ టు డై’కు మనహాయింపు ఏమీ లేదు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కరోనా మహమ్మారి పంజా విసరడం, ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండటంతో మార్చిలో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మరో రెండు తేదీలు మారాయి. తాజాగా నాలుగోసారి విడుదల తేదీని మార్చారు. అయితే, ఈసారి ముందుకొచ్చారు. తొలుత సెప్టెంబర్‌ 30న ప్రీమియర్‌ షో ప్లాన్‌ చేశారు. కానీ, ఇప్పుడు సెప్టెంబర్‌ 28న లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రీమియర్‌ షోకు ఏర్పాట్లు చేసినట్టు చిత్రబృందం వెల్లడించింది. జేమ్స్‌ బాండ్‌గా నటించిన డేనియల్‌ క్రేగ్‌, నిర్మాతలు మైఖేల్‌ జి. విల్సన్‌, బార్బరా బ్రోకలీ, దర్శకుడు క్యారీ జోజి ఈ రెడ్‌ కార్పెట్‌ షోకు హాజరు కానున్నారు. అక్టోబర్‌ 8న అమెరికాలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఈసారైనా విడుదలవుతుందో? అప్పటికి కేసులు పెరిగితే వాయిదా పడుతుందో? చూడాలి.