ఈ సారి కొత్తగా బడ్జెట్.. స్వాతంత్ర్యం తరువాత తొలిసారి..!

ABN , First Publish Date - 2021-01-12T01:31:11+05:30 IST

పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఈ సారి బడ్జెట్‌ ముద్రణ చేయరాదని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు...

ఈ సారి కొత్తగా బడ్జెట్.. స్వాతంత్ర్యం తరువాత తొలిసారి..!

న్యూడిల్లీ: పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఈ సారి బడ్జెట్‌ ముద్రణ చేయరాదని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 1947, నవంబర్ 26న తొలిసారిగా స్వతంత్ర భారత పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ తరువాత ఇలా ప్రతులు లేకుండా ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఇదే. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కాపీలను డిజిటల్‌గానే వారికి అందించనున్నారు. సాధారణంగా పార్లమెంట్ బేస్‌మెంట్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో బడ్జెట్ ప్రతులను ముద్రించడం జరుగుతుంది. దీనికోసం భారీ స్థాయిలో సిబ్బంది అవసరం అవుతంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఇలా ఒకే చోట ఎక్కువమంది ఉంచడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కావడంతో బడ్జెట్ ముద్రణను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఏటా బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించే ‘హల్వా వేడుక’ కూడా ఈ ఏడాది ఉండదని తెలుస్తోంది.

Updated Date - 2021-01-12T01:31:11+05:30 IST