Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 13 2021 @ 17:09PM

నామినేషన్ ఉపసంహరించుకున్న ఈటల జమున

హుజురాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు నిలిచారు. నేటితో హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఈరోజు 12 మంది అభ్యర్థులు నామినేషన్‌ను ఉపసంహరించారు. పోలింగ్‌ కోసం మూడు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల సంఘం ఉపయోగించనుంది. ఈ రోజు సాయంత్రం స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల బుజ్జగింపులు ఫలించాయి. ఈ రోజు బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి లింగారెడ్డి కూడా నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సుమన్, వినోద్ కుమార్, మల్లిఖార్జున్, నూర్జహాన్ బేగం తదితరులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. చివరకు హుజురాబాద్ బరిలో 30 మంది నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement