నవ్వుపై నిషేధం.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం!

ABN , First Publish Date - 2021-12-21T02:22:44+05:30 IST

ఉత్తర కొరియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రజలెవ్వరూ 11 రోజుల పాటు నవ్వకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.

నవ్వుపై నిషేధం.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం!

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర కొరియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రజలెవ్వరూ 11 రోజుల పాటు నవ్వకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఉత్తరకొరియా మాజీ అధినేత, ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ తండ్రి దివంగత కిమ్ జాంగ్ ఇల్‌ను వర్థంతి సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రతి ఏటా పది రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తుంది.  అయితే.. ఈ ఏడు11 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని నిర్ణయించింది. 


ప్రభుత్వాదేశాల ప్రకారం.. డిసెంబర్ 17 మొదలు పదకొండు రోజుల పాటు ప్రజలెవ్వరూ వేడుకలు, వినోద కార్యక్రమాలు నిర్వహించకూడదు. అంతేకాకుండా.. ఈ సమయంలో నవ్వడం, మద్యం సేవించడం వంటివి చేయకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష పడుతుందని సమాచారం. ఈ నేరంపై అరెస్టైన వారు ఎప్పటికీ తిరిగిరారని కూడా స్థానికులు కొందరు తెలిపారు. ఇక కిమ్ జాంగ్ ఇల్ మరణించిన డిసెంబర్ 17న ప్రజలు షాపింగ్‌కు కూడా దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. 

Updated Date - 2021-12-21T02:22:44+05:30 IST