ముక్కుదిబ్బడ! ఇబ్బంది పెడుతుంటే...

ABN , First Publish Date - 2021-09-16T09:04:43+05:30 IST

చిన్నపిల్లల్లో ముక్కుదిబ్బడ సమస్య తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతూ నిద్రపోలేరు.

ముక్కుదిబ్బడ! ఇబ్బంది పెడుతుంటే...

చిన్నపిల్లల్లో ముక్కుదిబ్బడ సమస్య తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతూ నిద్రపోలేరు. సీజన్‌ మారుతున్న సమయంలో ఈ సమస్య కనిపించడం సహజమే. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏంచేయాలంటే....


ముక్కు దిబ్బడను తక్షణం దూరం  చేసే నాజల్‌ డ్రాప్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. డాక్టర్‌ సలహా మేరకు ఆ డ్రాప్స్‌ను ఉపయోగించాలి. ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు ఒకటి రెండు చుక్కలు వేస్తే వెంటనే రిలీఫ్‌ వస్తుంది.

వేడి నీటితో స్నానం చేయించాలి. ముక్కు దిబ్బడ తొలగిపోవడానికి ఈ చిట్కా కూడా పనికొస్తుంది.

పిల్లలు పడుకున్నప్పుడు తల కింద దిండు పెట్టాలి. తల పాదాల కన్నా ఎత్తులో ఉండేలా చూసుకుంటే సైనస్‌ గదుల్లో ఉన్న మ్యూకస్‌ బయటకు వచ్చేస్తుంది. 

బొర్లా పడుకోబెట్టి వీపు, భుజాలపై నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా రిలాక్స్‌ పొందుతారు. మ్యూకస్‌ పోవడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది.

ఆవిరి పట్టడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. అలాగే పిల్లలు ఉదయం వేళ కాసేపు ఎండలో ఆడుకునేలా చూడాలి.

Updated Date - 2021-09-16T09:04:43+05:30 IST