వైద్యశాఖలో సిబ్బంది నియామకానికి వారం రోజుల్లో నోటిఫికేషన్: ఆళ్ల నాని

ABN , First Publish Date - 2020-06-04T20:26:31+05:30 IST

శ్రీకాకుళం: జిల్లాలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని పర్యటించారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి..

వైద్యశాఖలో సిబ్బంది నియామకానికి వారం రోజుల్లో నోటిఫికేషన్: ఆళ్ల నాని

శ్రీకాకుళం: జిల్లాలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని పర్యటించారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీటీఐ, ఎంఆర్ఐ స్కాన్‌లు పనిచేయకపోవటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వాటికి ప్రతిపాదనలు పంపాలని నాని ఆదేశాలు జారీ చేశారు. వైద్యశాఖలో 9700 మంది సిబ్బంది నియామకానికి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. కార్పొరేట్ తరహాలో రోగులకు వైద్య సదుపాయం అందించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు.


Updated Date - 2020-06-04T20:26:31+05:30 IST