జొకోవిచ్‌కు ఝలక్‌

ABN , First Publish Date - 2020-11-22T09:12:13+05:30 IST

ఏటీపీ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు షాక్‌ తగిలింది. హోరాహోరీ మ్యాచ్‌లో జొకోపై

జొకోవిచ్‌కు ఝలక్‌

ఏటీపీ ఫైనల్స్‌ తుది పోరుకు థీమ్‌

లండన్‌: ఏటీపీ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు షాక్‌ తగిలింది. హోరాహోరీ మ్యాచ్‌లో జొకోపై నెగ్గిన డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) టైటిల్‌ పోరుకు దూసుకెళ్లాడు. శనివారం ఉత్కంఠ జరిగిన సెమీఫైనల్లో  ప్రపంచ మూడో ర్యాంకర్‌ థీమ్‌ 7-5, 6-7(10), 7-6(5)తో జొకోవిచ్‌ను ఓడించాడు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది. తొలిసెట్‌ను థీమ్‌ నెగ్గగా.. రెండో సెట్‌లో జొకో పైచేయి సాధించాడు. ఇక నిర్ణాయక ఆఖరిదైన మూడో సెట్‌ను థీమ్‌ టైబ్రేక్‌లో నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 

Updated Date - 2020-11-22T09:12:13+05:30 IST