ఆంబులెన్స్‌ డ్రైవర్‌గా ఎన్నారై.. కొవిడ్ బాధితులకు ఉచిత సేవ

ABN , First Publish Date - 2021-06-04T01:10:17+05:30 IST

తెలంగాణలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేలాది మంది కరోనా బారినపడుతున్నారు. మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితులను ఆసరాగా చేసుకుని.. కొందరు ఆంబులెన్సు డ్రై

ఆంబులెన్స్‌ డ్రైవర్‌గా ఎన్నారై.. కొవిడ్ బాధితులకు ఉచిత సేవ

హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేలాది మంది కరోనా బారినపడుతున్నారు. మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితులను ఆసరాగా చేసుకుని.. కొందరు ఆంబులెన్సు డ్రైవర్లు చెలరేగిపోతున్నారు. ఇష్టానుసారంగా కొవిడ్ బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఎన్నారై తరుణ్ కప్పల పెద్ద మనసు చాటుకున్నారు. తానే డ్రైవర్‌గా మారి హైదరాబాద్ పరిధిలో కొవిడ్ బాధితులకు ఉచితంగా ఆంబులెన్స్ సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. దీనిపై తరుణ్ కప్పల స్పందించారు. కొవిడ్ నేపథ్యంలో చాలా రోజుల నుంచి.. బాధితులకు మెడిసిన్, ఆక్సిజన్ సిలిండర్‌లను సమకూర్చినట్టు చెప్పారు. అయితే తాజాగా తన సోదరి స్నేహితురాలు కొవిడ్ బారినపడ్డ సమయంలో కొందరు ఆంబులెన్స్ డ్రైవర్ల ఇష్టానుసారంగా డబ్బులు డిమాండ్ చేయడాన్ని గమనించానన్నారు. దీంతో కరోనా బారినపడిన వారికి ఉచితంగా ఆంబులెన్స్ సర్వీసును అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. డల్లాస్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ద్వారా వాహనాన్ని సేకరించి.. మహమ్మారి బారినపడిన వారికి ఉచిత ఆంబులెన్స్ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు.


Updated Date - 2021-06-04T01:10:17+05:30 IST