Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ కేంద్ర కార్యాలయ మరమ్మతుల కోసం విరాళాలు సేకరించిన ఎన్నారై టీడీపీ నేతలు

ఎన్నారై డెస్క్: మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై అక్టోబర్‌లో వైపీసీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ నగరాలకు చెందిన ఎన్నారై టీడీపీ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యలయానికి మరమ్మతులు చేయించేందుకు కావాల్సిన డబ్బుల కోసం విరాళాలు సేకరించారు. పర్వతనేని దేవేంద్ర, కోడూరి శ్యాం ప్రసాద్, అన్నే రామకృష్ణ, యడ్లపల్లి ధరణేష్ తదితరుల చొరవతో విరాళాల రూపంలో సుమారు రూ. 7లక్షలను సేకరించారు. అంతేకాకుండా ఆ మొత్తాన్ని పెనమలూరు నియోజకవర్గ తెలుగదేశం పార్టీ ఇంఛార్జీ బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.  Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement