రైతు మహాగర్జన సభ వాయిదా

ABN , First Publish Date - 2021-04-21T05:58:48+05:30 IST

రైతు మహాగర్జన సభ వాయిదా

రైతు మహాగర్జన సభ వాయిదా

ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు

దామెర, ఏప్రిల్‌ 20 : ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 23న నిర్వహించతలపెట్టిన రైతు మహాగర్జన సభను వాయిదా వేస్తున్నట్లు ఆ సమాఖ్య రాష్ట్ర, జాతీయ నాయకులు ప్రకటిచారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను నిరసిస్తూ పేదలకు పెను భారంగా మారిన విద్యుత్‌ నియంత్రణ బిల్లును ఉప సంహరించుకోవాలని, రైతులకు గ్యారంటీ మద్దతు ధర కల్పిస్తూ చట్టం రూపొందించాలని డిమాండ్‌ చేస్తూ.. ఓసీ సమాఖ్య రాష్ట్ర, జాతీయ కమిటీలు కమిటీ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పలు డిమాండ్లతో 23న కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త రైతు మహాగర్జన సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఓసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కామిడి సతీ్‌షరెడ్డి, రూరల్‌ జిల్లా అధ్యక్షుడు కొలుగూరి రాజేశ్వర్‌రావు మంగళవారం వరంగల్‌ జిల్లా కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి సభను ఎప్పుడు నిర్వహించే తేదీని తొందరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-04-21T05:58:48+05:30 IST