కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని పరిరక్షించాలి

ABN , First Publish Date - 2021-10-23T04:55:14+05:30 IST

కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని పరిరక్షించాలి

కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని పరిరక్షించాలి
నాగారం మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

కీసర రూరల్‌: నాగారం మున్సిపాలిటీ పరిధి సర్వేనంబర్లు 47, 55, 56, 60లో ఏర్పాటైన లేఅవుట్‌లో కబ్జాకు గురైన పార్కును, రోడ్లను, పరిరక్షించాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్‌ నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. 1980వ సంవత్సరంలో పంచాయతీ అనుమతితో దాదాపు 10 ఎకరాల్లో లేఅవుట్‌ ఏర్పాటుచేసి, 162 ప్లాట్లు, 12,000 చదరపు అడుగుల వైశాల్యంతో రోడ్లు, 1,670 గజాల్లో పార్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలక్రమేనా పక్కనే ఉన్న ఐకాం కంపెనీ యాజమాన్యం సదరు లేఅవుట్‌లోని పార్కుస్థలంతో పాటు 13,670గజాల స్థలాన్ని కబ్జాచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా మున్సిపల్‌ పాలకవర్గం నాటినమొక్కలను తొలగించి, ఏకంగా ప్రహరీని నిర్మించారన్నారు. ఈవిషయమై సంబంధిత అధికారులు పట్టించుకోవటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై గత జూన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై మండిపడ్డారు. కోట్ల రూపాయల విలువచేసే స్థలం కబ్జా ఐనప్పటికీ నిర్లక్ష్యం వహించటంపై సందేహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి కబ్జాకు గురైన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ నాగారం మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు చక్రపాణిగౌడ్‌, రాంరెడ్డి, క్రాంతిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వినీత్‌రెడ్డి, సందీ్‌పరెడ్డి అజీజ్‌రెడ్డి, మణి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T04:55:14+05:30 IST