Abn logo
Oct 18 2020 @ 19:13PM

పాతబస్తీలో దారుణం.. యువతి హత్య

Kaakateeya

హైదరాబాద్‌: పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై దుండగులు అత్యాచారం చేసి హత్యచేశారు. అత్యాచారం అనంతరం నారాయణఖేడ్‌కు చెందిన యువతిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి హత్యకు దారితీసిన కారణాల గురించి నిందితుడి నుంచి పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. యువతి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. నారాయణఖేడ్‌కు యువతి మృతదేహాన్ని తరలించారు.


ఈ సంఘటనతో నారాయణఖేడ్‌తోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బిడ్డను హత్య చేయడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురిని హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ఈ సంఘటనతో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement
Advertisement