తండ్రి కడచూపూ కరువాయె

ABN , First Publish Date - 2020-03-30T10:28:48+05:30 IST

పాపం వలస కార్మికులు... ఆప్తులెవరైనా చనిపోతే కడచూపునకు నోచుకోడం లేదు. వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం లాల్‌సింగ్‌ తండాలో టాక్రీనాయక్‌ (80) చనిపోయారు. నలుగురు కుమారుల్లో పెద్ద

తండ్రి కడచూపూ కరువాయె

వికారాబాద్‌లో వృద్ధుడు మృతి

ముంబైలోనే ముగ్గురు కుమారులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పాపం వలస కార్మికులు... ఆప్తులెవరైనా చనిపోతే కడచూపునకు నోచుకోడం లేదు. వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం లాల్‌సింగ్‌ తండాలో టాక్రీనాయక్‌ (80) చనిపోయారు. నలుగురు కుమారుల్లో పెద్ద కొడుకు చనిపోయాడు. మిగిలిన ముగ్గురు ఉపాధి కోసం ముంబై వెళ్లి అక్కడే ఉంటున్నారు.  తండ్రి అంత్యక్రియల కోసం వచ్చేందుకు కుమారులను అక్కడి అధికారులు అనుమతించలేదు. దీంతో పెద్ద కుమారుడి పిల్లలు, స్థానికులే అంత్యక్రియలు జరిపించారు. మహారాష్ట్ర నుంచి స్వస్థలాలకు తిరిగొస్తూ కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా కజూరి  చెక్‌పోస్టు వద్ద చిక్కుకుపోయిన నారాయణపేట జిల్లా వలస కూలీల ఇబ్బందులు అన్నీఇన్నీకావు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. తిండి కి కూడా ఇబ్బందులు పడుతున్నామని కూలీలు వాపోతున్నారు.


ఏపీలోని నెల్లూరు నుంచి ఢిల్లీ వెళుతున్న వలస కార్మికులకు తూప్రాన్‌లో రామాంతాపూర్‌ దర్గా కమిటీ ఆహారపొట్లాలను అందజేసింది. మహబూబాబాద్‌ రూరల్‌ మండలం అమన్‌గల్‌ వద్ద మహారాష్ట్రకు తిరిగి వెళుతున్న కూలీలను చూసి మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆగారు. వారికి 10వేలు సాయం అందించారు. వలస కార్మికులకు ఉచితంగా భోజనం అందిస్తామని ట్రస్మా పేర్కొంది. అసోసియేషన్‌ అధ్యక్షుడు శేఖర్‌రావు ఆఽధ్వర్యంలో కార్యవర్గం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను ఆయన నివాసంలో కలిసింది. 

Updated Date - 2020-03-30T10:28:48+05:30 IST