Abn logo
Aug 28 2021 @ 17:00PM

మరోసారి ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో మరోసారి ఫారెస్ట్ అధికారులు పోడు వ్యవసాయాన్నిఅడ్డుకున్నారు. చండ్రుగొండ మండలంలోని సీతాయిగూడెంలో పోడు రైతులు సాగుచేసిన పత్తి, మొక్కజొన్న పంటను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసారు. దీనిని పోడు సాగు చేసిన రైతులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారుల చర్యకు నిరసనగా ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రైతులు  ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.