ఒకరి వెంట ఒకరు..
ABN , First Publish Date - 2021-05-09T09:12:28+05:30 IST
కుటుంబా ల్లో ఒకరి తర్వాత ఒకరుగా వరుసపెట్టి కబళించేస్తోంది కరోనా. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 25 రో జుల వ్యవధిలో కరోనాతో మరణించారు
కుటుంబాలను కబళిస్తోన్న కరోనా
ఆడిటర్ కుటుంబంలో నలుగురు మృతి
డాక్టర్ కుటుంబంలో దంపతులు మృతి..ఆస్పత్రిలో కుమారుడు
జంగారెడ్డిగూడెం, నరసాపురం, మే 8: కుటుంబా ల్లో ఒకరి తర్వాత ఒకరుగా వరుసపెట్టి కబళించేస్తోంది కరోనా. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 25 రో జుల వ్యవధిలో కరోనాతో మరణించారు. అదే జిల్లా నరసాపురంలోని మరో కుటుంబంలో వారం వ్యవధి లో దంపతులు మృతి చెందగా, కుమారుడు ఆస్పత్రి పాలయ్యారు. జంగారెడ్డిగూడెంలోని ఆడిటర్‌కు భా ర్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఆడిటర్ రెండేళ్ల క్రితమే గుండెపోటుతో మరణించారు. స్థానికంగా ఫర్నీచర్ వ్యాపారం చేసే పెద్ద కుమారుడు 25 రోజు ల క్రితం కరోనాతో మృతి చెందారు. తర్వాత మూడు రోజుల వ్యవధిలో తల్లి, రెండో కుమారుడు కరోనాకు బలయ్యారు. తాజాగా, మూడో కుమారుడు శుక్రవా రం సాయంత్రం మరణించారు. అలాగే నరసాపురం పట్టణం వీవర్స్‌కాలనీకి చెందిన పీఎంపీ వైద్యుడు కరోనాకు చికిత్స పొందుతూ వారం క్రితం మృతి చెం దారు. తరువాత ఆయన భార్య కూడా కరోనా బారినపడి ఆస్పత్రిలో మరణించారు. ఈ క్రమంలోనే వారి కుమారుడికి వైరస్ సోకింది. ఆయన ప్రస్తుతం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.