Abn logo
Jun 3 2020 @ 03:53AM

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

నెక్కొండ, జూన్‌ 2 : నెక్కొండ మండలం పనికర సమీపంలో మంగళవారం  జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ లావుడ్య శంకర్‌ (40) మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం. పత్తిపాక గ్రామ శివారు లావుడ్యా తండాకు చెందిన శంకర్‌ నెక్కొండకు వస్తుండగా, దీక్షకుంటకు చెందిన అందె రఘు నర్సంపేటకు వెళ్తున్న క్రమంలో వీరి ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శంకర్‌ అక్కడిక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన రఘును వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. శంకర్‌కు భార్య శ్రీకాంత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే రఘు నెక్కొండలోని ఎఫ్‌సీఐ గోదాములో హామాలిగా పనులు చేస్తున్నాడు. 

Advertisement
Advertisement