Abn logo

బంగాళదుంప ఉల్లిపాయ చీలా

కావలసినవి: బంగాళదుంపలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, శనగపిండి - మూడు టేబుల్‌స్పూన్లు, గోధుమపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, జీలకర్ర - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెన్న - కొద్దిగా. 


తయారీ విధానం: బంగాళదుంపలను సన్నగా, ముక్కలుగా తరగాలి. ఉల్లిపాయను కట్‌ చేసుకోవాలి. కట్‌ చేసుకున్న బంగాళదుంప ముక్కలను చల్లని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఒక చిన్న బౌల్‌లో శనగపిండి తీసుకుని అందులో గోధుమపిండి, ఉల్లిపాయ, కారం, జీలకర్ర, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. తరువాత నీళ్లలో నానబెట్టిన బంగాళదుంపలను వేసి కలియబెట్టాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా వెన్న రాసి స్పూన్‌తో కాస్త మందంగా దోశలా పోసుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి పొటాటో - ఆనియన్‌ చీలాను పుదీనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.

వేరుశనగల చాట్‌దోశకార్న్‌ చీజ్‌ బాల్స్‌మసాలా తమలపాకుల వడలుఆలూ మసాలా పూరిబేక్డ్‌ అరటికాయ సమోసఈస్ట్‌ వెస్ట్‌ స్ర్పింగ్‌ రోల్స్‌ఆల్మండ్‌ కోఫ్తారాజ్మా పకోడివెజ్‌ బర్గర్‌
Advertisement