ఓయూ జర్నలిజం ప్రొఫెసర్‌ బాలస్వామి..

ABN , First Publish Date - 2021-05-08T08:01:46+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో అఽధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ బి.బాలస్వామి(47) కరోనా తో మృతి చెందారు.

ఓయూ జర్నలిజం ప్రొఫెసర్‌ బాలస్వామి..

ఉప్పల్‌, మే 7(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో అఽధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ బి.బాలస్వామి(47) కరోనా తో మృతి చెందారు. 20 రోజుల పాటు కొవిడ్‌తో పోరాడిన ఆయన కాచిగూడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. గుంటూరు జిల్లాకు చెందిన బాలస్వామి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీజీ చేశారు. డాక్టరేట్‌ సాధించారు. తొలుత అసోంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2004లో ఓయూ జర్నలిజం విభాగంలో అధ్యాపకునిగా చేరారు. విభాగం అధిపతిగా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా పనిచేశారు. కలివిడిగా ఉండే బాలస్వామి ఎంతోమంది విద్యార్థులను పీహెచ్‌డీ పూర్తి చేసేలా సహాయ సహకారాలు అందించారు. బాలస్వామి మృతి పట్ల ఓయూ విద్యార్థులు, అఽధ్యాపకులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాలస్వామికి భార్య, కుమారుడు ఉన్నారు.

Updated Date - 2021-05-08T08:01:46+05:30 IST