ఆక్సిజన్‌ ఒక్కటే మార్గం

ABN , First Publish Date - 2021-04-29T09:16:06+05:30 IST

అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్‌కు బదులు నెబ్యులైజర్‌ వాడొచ్చు. కర్పూరం, లవంగం, యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి వాసన చూసినా..

ఆక్సిజన్‌ ఒక్కటే మార్గం

ఏది నిజం ?


ప్రచారం: అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్‌కు బదులు నెబ్యులైజర్‌ వాడొచ్చు. కర్పూరం, లవంగం, యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి వాసన చూసినా.. అల్లం, వెల్లుల్లి దగ్గర పెట్టుకున్నా ఆక్సిజన్‌ స్థాయులు పెరుగుతాయి.


వివరణ: ఈ ప్రచారంలో నిజం లేదు. కరోనా కారణంగా రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గినప్పుడు.... నేరుగా ఆక్సిజన్‌ అందించడమొక్కటే ప్రత్యామ్నాయం. నెబులైజర్‌ వాడినా ఆక్సిజన్‌ అందదు. ఇక... కర్పూరం, లవంగం, అల్లం, వెల్లుల్లి వంటివి దగ్గర ఉంచుకుంటే ఆక్సిజన్‌ పెరుగుతుందనే ప్రచారాన్ని కూడా నమ్మవద్దు. అవసరమైనప్పుడు ఆస్పత్రికి వెళ్లి లేదా... ఇంటి వద్దే ఉండి కాన్‌సన్‌ట్రేటర్‌ లేదా నేరుగా సిలిండర్‌ నుంచి ఆక్సిజన్‌ తీసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో రెండు లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయగల యంత్రం రూ.50 వేలకు, 8-10 లీటర్ల సామర్థ్యం ఉన్న యంత్రం రూ.లక్షన్నరకు లభిస్తున్నాయి. అలాగే... ఆక్సీమీటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు శాచురేషన్స్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు  చేతి వేలికి గోరింటాకు లేదా గోళ్ల రంగులు లేకుండా చూసుకోవాలి. చేతులు సాధ్యమైనంత వేడిగా ఉండాలి. అప్పుడే కచ్చితమైన రీడింగ్‌ వస్తుంది. 

- డాక్టర్‌ సుధీర్‌ బాబు, గుంటూరు వైద్య కళాశాల ప్రొఫెసర్‌    

Updated Date - 2021-04-29T09:16:06+05:30 IST