పాలక్‌ రైతా

ABN , First Publish Date - 2021-05-20T19:48:52+05:30 IST

పాలకూర కట్టలు- నాలుగు, పుల్ల పెరుగు- ఓ కప్పు, పచ్చి కొబ్బరి- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, మిరియాలు- నాలుగు, ఉప్పు- తగినంత పోపు గింజలు- ఓ స్పూను, కరివేపాకు- ఓ రెబ్బ, నెయ్యి- ఓ స్పూను

పాలక్‌ రైతా

కావలసిన పదార్థాలు: పాలకూర కట్టలు- నాలుగు, పుల్ల పెరుగు- ఓ కప్పు, పచ్చి కొబ్బరి- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, మిరియాలు- నాలుగు, ఉప్పు- తగినంత పోపు గింజలు- ఓ స్పూను, కరివేపాకు- ఓ రెబ్బ, నెయ్యి- ఓ స్పూను.


తయారు చేసే విధానం: పాలకూరను బాగా కడిగి ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నెయ్యివేసి మిరియాలు, జీలకర్ర, పచ్చి మర్చిని వేయించాలి. ఆ తరవాత పాలకూరను కూడా వేసి రెండు నిమిషాలు వేగాక దించి చల్లారనివ్వాలి. కొబ్బరి తురుము, ఉప్పు, కరివేపాకు, పాలకూర మిశ్రమం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి వేసి, పెరుగు కలిపి పోపు పెడితే సరి.

Updated Date - 2021-05-20T19:48:52+05:30 IST