నోకియా.. పాజిటివ్‌ కాదు

ABN , First Publish Date - 2021-04-17T09:07:52+05:30 IST

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట. పేసర్‌ ఎన్రిచ్‌ నోకియాకు కరోనా సోకలేదని తేలింది. ఇదివరకు అతడికి పాజిటివ్‌గా.

నోకియా.. పాజిటివ్‌ కాదు

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట. పేసర్‌ ఎన్రిచ్‌ నోకియాకు కరోనా సోకలేదని తేలింది. ఇదివరకు అతడికి పాజిటివ్‌గా తప్పుడు ఫలితం వచ్చిందని ఢిల్లీ ఫ్రాంచైజీ పేర్కొంది. ఈనె 6న సహచర పేసర్‌ రబాడతో నోకియా దక్షిణాఫ్రికా నుంచి ముంబై చేరాడు. ఆ వెంటనే చేసిన పరీక్షలో నెగెటివ్‌గా తేలాడు. ఆ తర్వాత క్వారంటైన్‌లో ఉండగా పాజిటివ్‌ ఫలితం వచ్చింది. కానీ అనంతరం మూడుసార్లు చేసిన ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్‌గా రావడంతో క్వారంటైన్‌ను వీడి జట్టు బయో బబుల్‌లో చేరాడు. 

Updated Date - 2021-04-17T09:07:52+05:30 IST