పెయిడ్‌ యాప్స్‌ ఫ్రీ డౌన్‌లోడ్‌!

ABN , First Publish Date - 2021-10-02T05:37:13+05:30 IST

ప్లేస్టోర్‌లో కనిపించే యాప్స్‌ అన్నీ ఉచితం కాదు. అందుకే వాటిని ఉపయోగించుకోవాలనుకునేవారు ప్రీమియమ్‌ యాప్స్‌నకు సంబంధించి పైరేటెడ్‌ వెర్షన్స్‌ డౌన్‌లోడ్‌

పెయిడ్‌ యాప్స్‌ ఫ్రీ డౌన్‌లోడ్‌!

ప్లేస్టోర్‌లో కనిపించే యాప్స్‌ అన్నీ ఉచితం కాదు. అందుకే వాటిని ఉపయోగించుకోవాలనుకునేవారు ప్రీమియమ్‌ యాప్స్‌నకు సంబంధించి పైరేటెడ్‌ వెర్షన్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే యత్నం చేస్తారు. అయితే ప్లేస్టోర్‌ను రెగ్యులర్‌గా చెక్‌చేస్తూ ఉంటే పెయిడ్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను ఉచితంగా లేదంటే డిస్కౌంట్‌తో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది.  అదెలాగంటే...



ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగామూడు వందల కోట్ల ఫోన్లలో గూగుల్‌ ప్లే స్టోర్‌ యాక్టీవ్‌గా ఉందట. ఈ ప్లేస్టోర్‌లో ముప్పై లక్షల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. నిజానికి తమ ప్రతిభను కనబర్చుకునేందుకు డెవలపర్లకు ఆండ్రాయిడ్‌ ఓ మంచి వేదిక. ఇందులో ఉండే యాప్స్‌ చాలా వరకు ఉచితం. కొన్ని మాత్రం యాడ్స్‌ సహాయంతో వస్తాయి, మరికొన్ని డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 


నిజానికి డెవలపర్స్‌ ఎదుర్కొనే అదిపెద్ద సమస్య పైరసి. కొంతమంది ప్రీమియమ్‌ లేదా పెయిడ్‌ యాప్స్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. 


ఐఓఎస్‌ డెవలపర్లకు ఎలాంటి ఇబ్బందీ లేదు. యాపిల్‌ స్టోర్‌ నుంచి మినహా వారి యాప్‌లను మరెక్కడి నుంచీ డౌన్‌లోడ్‌ చేసుకోవడం కుదరదు. ఆండ్రాయిడ్‌  డెవలపర్లే పైరేటెడ్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటూ మాల్వేర్‌, వైర్‌సల బారిన పడి ఇబ్బందులను ఎదుర్కొంటారు.  


అలాగే కొనుగోలు చేయలేనంత మాత్రాన ఆ యాప్‌ల పైరేటెడ్‌ వెర్షన్స్‌ కోసం అర్రులు చాచాల్సిన పని లేదు. గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళితే   జాగ్రత్తగా పరిశీలిస్తే డిస్కౌంట్లు, ఉచిత ప్రమోషన్లు కనిపిస్తాయి. అప్పుడప్పుడు ఆండ్రాయిడ్‌ యాప్స్‌, గేమ్స్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది. యాప్స్‌ఫ్రీ, యాప్‌సేల్స్‌, పెయిడ్‌ యాప్స్‌ గాన్‌ ఫ్రీ, ఫ్రీయాప్స్‌ నౌ వంటివి ప్రమోషనల్‌ ఫ్రీ యాప్స్‌ను విడుదల చేస్తూంటాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడమే కాదు, మీ లైబ్రరీలో యాడ్‌ చేసుకోవచ్చు. అంటే కొనుగోలు చేయాల్సిన ఆండ్రాయిడ్‌ యాప్‌ను ఉచితంగా గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పొందారన్నమాట. తరవాతి రోజుల్లో ప్రమోషన్‌ పీరియడ్‌ ముగిసిన తరవాత మరో డివై్‌సపై కూడా పొందవచ్చు.

Updated Date - 2021-10-02T05:37:13+05:30 IST