భవనం నుంచిపడి పెయింటర్‌ దుర్మరణం

ABN , First Publish Date - 2021-07-17T12:11:21+05:30 IST

భవనం నుంచి కిందపడటంతో ఓ పెయింటర్‌ దుర్మరణం చెందాడు. ఈస్ట్‌ ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లాకు చెందిన అంజి (35) తిరుపతిలో పెయింట్‌ పనిచేసుకుంటూ

భవనం నుంచిపడి పెయింటర్‌ దుర్మరణం

తిరుపతి: భవనం నుంచి కిందపడటంతో ఓ పెయింటర్‌ దుర్మరణం చెందాడు. ఈస్ట్‌ ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లాకు చెందిన అంజి (35) తిరుపతిలో పెయింట్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పాత రేణిగుంట రోడ్డులో నిర్మాణం పూర్తయిన ఓ భవనానికి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి పెయింటింగ్‌ పనులు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కింద పడ్డాడు. తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. 

Updated Date - 2021-07-17T12:11:21+05:30 IST