గురుద్వారాను ధ్వంసం చేసి.. లేఖను విడిచి వెళ్లిన నిందితుడు

ABN , First Publish Date - 2020-05-26T04:19:58+05:30 IST

యూకేలోని డెర్బీ నగరంలో ఉన్న గురు ఆర్జన్ దేవ్ గురుద్వారాను ధ్వంసం

గురుద్వారాను ధ్వంసం చేసి.. లేఖను విడిచి వెళ్లిన నిందితుడు

డెర్బీ: యూకేలోని డెర్బీ నగరంలో ఉన్న గురు ఆర్జన్ దేవ్ గురుద్వారాను ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పాకిస్థాన్‌కు చెందిన వాడని.. ద్వేషపూరితంగా గురుద్వారాను ధ్వంసం చేసినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా గురుద్వారాలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోలేదని పోలీసులు తెలిపారు. మరోపక్క నిందితుడు గురుద్వారాలో ఓ లెటర్‌ను కూడా వదిలిపెట్టినట్టు పోలీసులు చెప్పారు. ఈ లెటర్‌లో ‘కశ్మీర్ ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నించండి.. లేదంటే అది అందరికి సమస్య’ అని రాసి ఉంది. ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో ఉన్నాడని.. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. మరోపక్క గురుద్వారా పెద్దలు దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం ఆరు గంటలకు అనుమానాస్పద వ్యక్తి గురుద్వారాలోకి ప్రవేశించినట్టు.. వేల పౌండ్ల నష్టం చేసినట్టు ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని.. గురుద్వారా మరమ్మతుల పనులు మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. కాగా.. ఈ గురుద్వారా నిత్యం 400 నుంచి 500 మందికి ఆహారం అందజేస్తూ వస్తోంది. అంతేకాకుండా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సైతం తమ సహాయాన్ని అందజేస్తోంది.

Updated Date - 2020-05-26T04:19:58+05:30 IST