Abn logo
Sep 18 2021 @ 01:42AM

పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి గడువు పెంపు

  • 2022 మార్చి 31 వరకు గడువు పొడిగించిన కేంద్రం

న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా నెంబరు (పాన్‌)తో ఆధార్‌ అనుసంధానానికి గడువును 2022 మార్చి 31 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు గతంలో నిర్దేశించిన గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సింది. కరోనా కాలంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా మరో ఆరు నెలల సమ యం కల్పిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) శుక్రవారం వెల్లడించింది. అంతేకాదు, ఐటీ చట్టంలో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేసేందుకు సైతం గడువును ఈ నెల 30 నుంచి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించింది. ‘బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక చట్టం, 1988’లో భాగంగా తీర్పు ఇచ్చే అధికారి నోటీసులు, ఆదేశాల జారీకి కాలపరిమితిని సైతం వచ్చే మార్చి ఆఖరి వరకు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ స్పష్టం చేసింది.