జగన్ జైలుకు వెళితే.. పోటీ వీరిమధ్యే..: పంచుమర్తి

ABN , First Publish Date - 2020-02-23T00:32:28+05:30 IST

విజయవాడ: జగన్ జైలుకు వెళితే ముఖ్యమంత్రి కావాలని చాలామంది ..

జగన్ జైలుకు వెళితే.. పోటీ వీరిమధ్యే..: పంచుమర్తి

విజయవాడ: జగన్ జైలుకు వెళితే ముఖ్యమంత్రి కావాలని చాలామంది పోటీపడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. రోజా, బొత్స, షర్మిల, విజయలక్ష్మి, భారతి సహా.. ఈ లిస్టులో చాలా మంది ఉన్నారని అన్నారు. రోజా మాట తీరు మహిళలు సిగ్గుపడే విధంగా ఉందని విమర్శించారు. శనివారం గుంటూరు జిల్లా, మంగళగిరిలో మహిళ జేఏసీ నేతల నిరసన శిబిరాన్ని ఆమె దర్శించి సంఘీభావం తెలిపారు.


ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ వేరే దేశం వాళ్లు ఏ-3 ముద్దాయి నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేశారన్నారు. ఏ-1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నారని, ఈయన త్వరలోనే జైలుకు వెళతారని అంతా అనుకుంటున్నారని అన్నారు. జగన్ జైలుకు వెళితే.. ఏపీ సీఎం ఎవరన్నదానిపై చర్చ జరుగుతోందన్నారు.

Updated Date - 2020-02-23T00:32:28+05:30 IST