Abn logo
Apr 8 2021 @ 15:20PM

ఆ మూడు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పి.. ప్రచారానికి రావాలి: పరిపూర్ణనంద

తిరుపతి: రాయలసీమ వెనుక బాటుతనం ఆలోచన లోపంవల్ల జరుగుతోందని పరిపూర్ణనంద స్వామి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి తిరుమలను వివాదంలోకి లాగటం కొంతమంది రాజకీయ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. పింక్ డైమెండ్ వివాదం ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. సీఎం జగన్ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి తిరుపతి ప్రచారానికి రావాలన్నారు. 1. టీటీడీని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌లోకి ఎందుకు తీసుకురాలేదు? 2. తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయ వివాదం నేపథ్యంలో 25 సంవత్సరాలు టీటీడీ ఆస్తుల క్రయ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. 3. 250 గత ప్రభుత్వం, 350 ఈ ప్రభుత్వం ఆలయాలను కూల్చిందని.. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు.


జగన్ ఖచ్చితంగా క్రైస్తవుడే. అయితే హిందు సమాజానికి మంచి చేస్తున్నానని చెప్పి మౌనం పాటించడం తగదని పరిపూర్ణనంద స్వామి అన్నారు. టీటీడీకి.. రాజకీయాలకు అతీతమైన బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. రమణదీక్షితులు సీఎం జగన్‌ను విష్ణువు అనటాన్నీ వైసీపీ మొదట ఖండించాలన్నారు. జగన్ కూడా ఖచ్చితంగా ఖండించాలని సూచించారు. ఇలాంటివి ప్రోత్సహించిన వారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. జగన్‌ను విష్ణువు అని చెప్పి అభిషేకాలు చేసి కిరీటం పెడతారా? అని పరిపూర్ణనంద స్వామి ప్రశ్నించారు.

Advertisement
Advertisement
Advertisement