పాక్షిక లాక్‌డౌన్‌ అభినందనీయం

ABN , First Publish Date - 2021-05-07T03:14:02+05:30 IST

పది రోజులపాటు సుజాతనగర్‌లో పాక్షిక లాక్‌ డౌన్‌ అమలు అభినందనీయమని పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.నాగమణి అన్నారు.

పాక్షిక లాక్‌డౌన్‌ అభినందనీయం
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ నాగమణి

సుజాతనగర్‌, మే 6: పది రోజులపాటు సుజాతనగర్‌లో పాక్షిక లాక్‌ డౌన్‌ అమలు అభినందనీయమని పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.నాగమణి అన్నారు. గురువారం స్థానిక సుజాతనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుజాతనగర్‌ వ్యాపారులతో కోవిడ్‌ నియం త్రణ, వ్యాపారులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాక్షిక లాక్‌డౌన్‌ వంటి అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...సుజాతనగర్‌లో కోవిడ్‌ కేసులు నానాటికి పెరుగుతున్నాయని అన్నారు.  మండల స్థాయి అధికారులతో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌, టెస్ట్‌ల గు రించి, కోవిడ్‌ టీకా తీసుకోవలసిన జాగ్రతల గురించి సమావేశంలో చర్చించారు. కోవిడ్‌ ని యంత్రణలో భాగంగా 45 సంవత్సరాలు దాటిన వారు వ్యాక్సిన్‌ కోసం ముందుగా కోవిన్‌ యాప్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలన్నారు. అనంతరం స్దానిక వ్యాపారులతో లాక్‌ డౌన్‌పై చర్చ లు జరిపారు. ఆ చర్చల్లో భాగంగా సుజాతనగర్‌లో మధ్యాహ్నం 1 గంట వరకే  అన్ని రకాల వ్యాపారాలు మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం అభినందనీయమన్నారు. ఈ పాక్షిక లాక్‌డౌన్‌ ఈ నెల 7 నుంచి 17వరకు 10రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యమేనని తహశీల్దార్‌ టి.సునిల్‌రెడ్డి అన్నారు. అనంతరం ఎస్‌ఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ... వ్యాపారాలు మూసివేతతో నష్టం కంటే ఒక మాత్రమే కొంచెం నష్టమైనా ప్రజల శ్రేయస్సు కోసం తీసుకొనే చర్యల్లో అందరు భాగస్వాములు కావాలని, పాక్షిక లాక్‌డౌన్‌లో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కొవిడ్‌ సర్వేలైన్స్‌ టీం, ఎంపీడీవో వెంకటలక్ష్మి, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-07T03:14:02+05:30 IST