Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ బాధితులకు ప్రభుత్వం నుంచి ఏదీ ఓదార్పు?: పవన్

అమరావతి: జల విలయం జన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కడప జిల్లాలో తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కూలిన ఇళ్ళు, మేటలు వేసిన పొలాలు కనిపిస్తాయని చెప్పారు. అయిన వాళ్ళను కోల్పోయిన వారి బాధలు తెలుస్తాయన్నారు. జనసేన పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ వరద  గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారని తెలిపారు. నిత్యావసరాలు, పాత్రలు, దుప్పట్లు బాధితులకు అందచేశారని పేర్కొన్నారు. ఆ గ్రామాల్లో విద్యుత్ ఇప్పటికీ పునరుద్ధించలేదని మండిపడ్డారు. చీకట్లో బతుకుతున్నారని, గూడు కోల్పోయి నిరాశ్రయంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధితులకు ప్రభుత్వం నుంచి ఏదీ ఓదార్పు? అని ప్రశ్నించారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement