తెలుగు ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-01-14T23:04:39+05:30 IST

తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి తెలుగువారందరికీ ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను

తెలుగు ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

అమరావతి: తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి తెలుగువారందరికీ ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సౌభాగ్యంగా ఉండాలని కోరుకున్నారు. భారతీయ పండుగలన్నీ ప్రకృతి, పర్యావరణ ఆధారిత సంబరాలేనని తెలిపారు. ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసుకుని రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి పండుగ అని పేర్కొన్నారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సౌభాగ్యవంతంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి తెలుగువారందరికీ మంచి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలన్నారు. భారతీయులందరికీ తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ వివరించారు.

Updated Date - 2022-01-14T23:04:39+05:30 IST