Abn logo
May 14 2021 @ 02:54AM

ఇసుక కొరత రానివ్వొద్దు: పెద్దిరెడ్డి

ఇసుక కొరత లేకుండా చూడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించాలని, ఎస్‌ఈబీతోపాటు జిల్లాల్లోని జాయింట్‌ కలెక్టర్లు, మైనింగ్‌ అధికారులు.. నోడల్‌ అధికారులుగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. గురువారం ఉపాధి హామీ పథకం, ఇసుకరీచ్‌లకు సంబంధించి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వినియోగదారులకు ఇసుక కొరత ఏర్పడకుండా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని మైనింగ్‌ అధికారులను ఆదేశించారు. అన్ని ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, వేయింగ్‌ మెషిన్లు పకడ్బందీగా పనిచేయాలని అధికారులకు సూచించారు. సోమవారం జేపీ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాలు ప్రారంభిస్తుందని డీఎంజీ, ఏపీఎండీసీ వీసీ అండ్‌ ఎండీ (విజిలెన్స్‌) వెంకటరెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement