ఆహార భద్రతకు విఘాతం

ABN , First Publish Date - 2021-04-22T05:54:17+05:30 IST

జిల్లాలోని అనేక మంది పేదలకు ఆహా ర భద్రత కరువైంది. కొత్త రేషన్‌ కార్డులు రాక అవస్థలు పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్నా వాటిని అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. కొత్త రేషన్‌ కార్డు లు జారీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు అడుగులు ముందుకు వేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హత ఉన్నప్పటికీ కార్డులు రాక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆహార భద్రతకు విఘాతం

 కొత్త రేషన్‌కార్డులు రాక ఇబ్బందులు

 కార్యాలయాల్లో పేరుకుపోయిన దరఖాస్తులు

 ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని అంటున్న అధికారులు

 సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని అర్జిదారుల ఆందోళన

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 21 : జిల్లాలోని అనేక మంది పేదలకు ఆహా ర భద్రత కరువైంది. కొత్త రేషన్‌ కార్డులు రాక అవస్థలు పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్నా వాటిని  అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. కొత్త రేషన్‌ కార్డు లు జారీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు అడుగులు ముందుకు వేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హత ఉన్నప్పటికీ కార్డులు రాక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

మూడేళ్లుగా కొత్త రేషన్‌కార్డులకు మోక్షం కలగడం లేదు. దీంతో జిల్లా లో వేలాది మంది వేచి చూడాల్సి వస్తోంది. దరాఖాస్తు చేసుకున్న వారు ఎప్పుడొస్తాయా...? అని నిరీక్షించే పరిస్థితి ఉండగా.. ఇప్పటికే కార్డుల్లో పేర్లు ఉండి  పెళ్లయ్యాక  మార్పులు చేర్పులు జరగాల్సినవి కూడా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆహారభద్రత లబ్ధి చేకూరక అనేక మంది లబోదిబోమంటున్నారు. 2020లో లాక్‌డౌన్‌ సమయంలో రేషన్‌ కార్డులు ఉన్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భృతిని ఇచ్చి భరోసానిచ్చాయి. రూ. రెండు వేలతోపాటు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశా యి. రేషన్‌కార్డులు లేకపోవడంతో జిల్లాలోని అనేక మందికి లబ్ధి చేకూరలేదు. ఈసారి కూడా కరోనా విజృంభణతో గత ఏడాది పరిస్థితులే ఎదురైతే ఇటు ఉపాధి లేక, అటు ప్రభుత్వ అం డగా లేక గడ్డు పరి స్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోమోనని రేషన్‌కార్డులు లేని కుటుంబా లు ఆందోళన చెందుతున్నాయి. 

కుప్పలు తెప్పలుగా..

జిల్లాలోని పౌరసరఫరాల కార్యాలయంలో రేషన్‌కార్డుల దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. జిల్లాలో ఇప్పటి వరకు 2,046 కొ త్త రేషన్‌కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండ గా, పాత రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పులకు 2,352 దరఖాస్తులు అక్కడే మూలుగుతున్నాయి. 

మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాం.. 

 లక్కాకుల సంపత్‌- తిరుమల, దూత్‌పల్లి (చిట్యాల మండలం) 

మా వివాహం 2017 జరిగింది. 2018 లో పాప పుట్టింది. ముగ్గురు కుటుంబ సభ్యుల వివరాలతో  కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నాం. ఇప్పటి వరకు కార్డు రాలేదు. మూడేళ్లుగా తహసీల్దార్‌,  పౌరసరఫరాల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం.  ప్రభుత్వం వెంటనే స్పందించి రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించాలి. 

 అనుమతి రాగానే మంజూరు చేస్తాం

- కూరాకుల స్వర్ణలత, జాయింట్‌ కలెక్టర్‌ 

ప్రభుత్వం నుంచి కొత్తరేషన్‌ కార్డుల మంజూరుపై అనుమతి రాలేదు. వచ్చిన వెంటనే కొత్త కార్డులను మంజూరు చేస్తాం. దరఖాస్తుదారులెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అర్హతను బట్టి కార్డులు అందజేస్తాం.

Updated Date - 2021-04-22T05:54:17+05:30 IST