మద్యం దుకాణాల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2021-11-11T01:54:40+05:30 IST

రాష్ట్రంలోని మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో

మద్యం దుకాణాల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్‌: రాష్ట్రంలోని మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని హైకోర్టుకు పిటిషనర్ తెలిపారు. ఏ ప్రాతిపదినక రిజర్వేషన్లు నిర్ణయించారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.  

Updated Date - 2021-11-11T01:54:40+05:30 IST