Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో పిటిషన్లు

అమరావతి: జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై దాఖలైన మూడు పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించింది. జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకపోవడం, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4కి విరుద్ధమని న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 100 కూడా సెక్షన్ 4కి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. అన్ని జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచితేనే.. పారదర్శకత ఉంటుందని న్యాయవాదులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఎందుకు సవాల్ చేయలేకపోయారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ జీవో కూడా సమాచారం హక్కు చట్టంలోని సెక్షన్ 4కి విరుద్ధమని న్యాయవాదులు వాదించారు. సోమవారం పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచుతామని  ప్రభుత్వం చెప్పింది. విచారణ వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.


Advertisement
Advertisement