Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలపై హైకోర్టులో పిల్

అమరావతి: మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టులో ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం పిల్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్‌లో ఉద్యోగాల భర్తీపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. గతంలో బీఎస్సీ విద్యార్థులకు కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ (సీపీసీహెచ్) ప్రభుత్వం అందించింది. గతంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు మాత్రమే.. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాలకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం బీఎస్సీ నాలుగో సంవత్సరంలో సీపీసీహెచ్ సిలబస్ ఏర్పాటు.. తాజాగా సీపీసీహెచ్ సిలబస్ ఆధారంగా 2020 బ్యాచ్‌ను అర్హులుగా పరిగణలోకి ప్రభుత్వం తీసుకుంది. దీంతో ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం  హైకోర్టును ఆశ్రయించింది. కొత్త నిబంధనలతో బీఎస్సీ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది గుడిపాటి శ్రీహర్ష తెలిపారు. 2020 ముందు బ్యాచ్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. ఏజీ హాజరుకాకపోవడంతో విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement