ఈ వారం కవితలు మరియు పురస్కారాల కార్యక్రమాలు

ABN , First Publish Date - 2021-10-11T06:38:38+05:30 IST

స్వాతంత్య్రంపై బాలల కవితల పోటీ కలేకూరిపై కవితలకు ఆహ్వానం వేదగిరి రాంబాబు పురస్కారాలు

ఈ వారం కవితలు మరియు పురస్కారాల కార్యక్రమాలు

స్వాతంత్య్రంపై బాలల కవితల పోటీ 

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి అక్షర సేద్యం ఫౌండేషన్‌ కవితలు ఆహ్వానిస్తోంది. నచ్చిన అంశంపై 20పంక్తులకు దాటకుండా రాసి పంపాలి. 75 ఉత్తమ కవితలను ఎంపిక చేసి, విజేతకు సాహిత్య పుస్తకాలు, ప్రశంస పత్రం బహుకరిస్తాం. కవితలతో సంకలన పుస్తకం రూపొందిస్తాం. కవితలను అక్టోబరు 20లోగా చిరునామా: అక్షరసేద్యం ఫౌండేషన్‌, రాముని పట్ల, సిద్దిపేట జిల్లా-502267కు లేదా 97019 33704 నంబరుకు వాట్సప్‌ చేయవచ్చు. 

భైతి దుర్గయ్య


కలేకూరిపై కవితలకు ఆహ్వానం

కలేకూరిప్రసాద్‌ 59వ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 25 సోమ వారం సా.5గం.లకు జరిగే సభలో కలేకూరిపై 30లైన్లలో రాసిన కవి తను చదవాలి. మూడు ఉత్తమ కవితలకు నగదు బహుమతితో పాటు, కలేకూరి ‘అంటరాని ప్రేమ’ పుస్తకం, ప్రశంసా పత్రం ఇస్తారు. మొదటి, రెండవ, మూడవ బహు మతులు వరుసగా రూ.2500, రూ.1500, రూ.1000. వివరాలకు: 96766 09234, 93815 22247.

తంగిరాల సోని



వేదగిరి రాంబాబు పురస్కారాలు

భాషా సాంస్కృతిక శాఖ, తెలం గాణ ప్రభుత్వం, సింహప్రసాద్‌ సాహిత్య సమితి నిర్వహణలో అక్టో బరు 14 ఉ.10గం.లకు రవీంద్రభారతి లో జరుగుతుంది. పురస్కార గ్రహీ తలు: ముంజులూరి కృష్ణకుమారి (బాలసాహిత్యం), రాచమళ్ళ ఉపేం దర్‌ (కథానిక). సభలో ‘మా కథలు 2020’, ‘దాడి’, ‘వెన్నెల గొడుకు’ పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. కె.వి. రమణాచారి, విహారి, సుధామ తదితరులు సభలో పాల్గొంటారు. 

సింహప్రసాద్‌ సాహిత్య సమితి 


Updated Date - 2021-10-11T06:38:38+05:30 IST