పోలీస్ జాగిలం రూబీ మృతి
ABN , First Publish Date - 2021-08-27T00:12:43+05:30 IST
ఎన్నో సంచలనాత్మక కేసుల ఛేదనలో భాగమైన పోలీస్ జాగిలం "రూబీ"
విశాఖ: ఎన్నో సంచలనాత్మక కేసుల ఛేదనలో భాగమైన పోలీస్ జాగిలం "రూబీ" అనారోగ్యంతో మృతి చెందింది. 2012 నుంచి విశాఖ జిల్లా పోలీస్‌శాఖలో రూబీ చేరింది. లేబ్రాడార్ రీ ట్రైవర్ జాతికి చెందిన జాగిలం రూబీ. 2012లో హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో పేలుడు పదార్థాలు కనిపెట్టడంలో రూబీ ప్రత్యేక శిక్షణ పొందింది. రూబీకి జిల్లా పోలీసు యంత్రాంగం ఘనంగా నివాళులర్పించింది. రూబీ మృతితో పోలీస్ శాఖలో విషాదఛాయలు నెలకొన్నాయి.