పాలసీ, గణాంకాలే కీలకం !

ABN , First Publish Date - 2021-08-02T06:02:23+05:30 IST

ఈ వారం మార్కెట్‌ గమనాన్ని ఆర్‌బీఐ పాలసీ, స్థూల ఆర్థిక గణాంకాలతో పాటు కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు నిర్ధేశించే వీలుంది.

పాలసీ, గణాంకాలే కీలకం !

వారం మార్కెట్‌ గమనాన్ని ఆర్‌బీఐ పాలసీ, స్థూల ఆర్థిక గణాంకాలతో పాటు కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు నిర్ధేశించే వీలుంది. గత ట్రెండ్స్‌ను పరిశీలిస్తే ఆగస్టు నెలలో మార్కెట్‌ రికార్డుల దిశగా సాగే అవకాశం కనిపిస్తోంది. అయితే చరిత్ర పునరావృత్తమవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. అప్‌ట్రెండ్‌లో సాగితే 15850-15950 దిశగా సాగే అవకాశాలున్నాయి. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ను కనబరిస్తే మాత్రం 15550- 15450 మద్దతు స్థాయిలుగా ఉంటాయి. ఇన్వెస్టర్లు స్టాక్‌ ఆధారిత విధానాన్ని అనుసరించటం మంచిది.


స్టాక్‌ రికమండేషన్స్‌

భారతి ఎయిర్‌టెల్‌ : గతవారం ద్వితీయార్థంలో ఈ షేరు బ్రేకౌట్‌ సాధించటమే కాకుండా అప్‌ట్రెండ్‌ను సూచిస్తోంది. గత శుక్రవారం రూ.561.65 వద్ద క్లోజైన ఈ షేరును స్వల్పకాలానికి రూ.592 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.540 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 


స్పిక్‌ : డైలీ టైమ్‌ ఫ్రేమ్‌ చార్టుల ప్రకారం ఈ షేరు బుల్లిష్‌ ప్యాట్రన్‌లోకి అడుగుపెట్టింది. గత శుక్రవారం రూ.63.90 వద్ద క్లోజైన ఈ షేరును.. రూ.70 స్వల్పకాలిక టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.61.80స్థాయిని స్టాప్‌లా్‌సగా కొనసాగించాల్సి ఉంటుంది.


మంగళం డ్రగ్స్‌ అండ్‌ ఆర్గానిక్స్‌: గత వారం ఈ షేరు రూ.175 వద్ద కొంతకాలంగా ఎదుర్కొంటున్న అడ్డంకుల నుంచి బయటపడి బుల్లిష్‌ జోన్‌లోకి ప్రవేశించింది. గత శుక్రవారం రూ.184.25 వద్ద క్లోజైంది. ప్రస్తుతం బహుళ సంవత్సరాల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతోంది. రానున్న రోజుల్లో మరింత అప్‌ట్రెండ్‌ను కనబరిచే వీలుంది. ఈ షేరు రూ.180-176 స్థాయిలకు పడినప్పుడు స్వల్పకాలానికి రూ.204 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.165 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


హీరో మోటోకార్ప్‌: గత ఆరు నెలలుగా ఈ షేరు అండర్‌ఫెర్‌ఫార్మ్‌ స్టాక్‌గా ఉంది. అయితే దీర్ఘకాలానికి మాత్రం మంచి పనితీరును కనబరిచే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ షేరు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యే వీలుంది. గత శుక్రవారం రూ.2,763.30 వద్ద క్లోజైన ఈ షేరు.. రూ.2,802 స్థాయిని అధిగమిస్తే దూకుడును ప్రదర్శించవచ్చు. రూ.2,910 స్థాయిని టార్గెట్‌గా పెట్టుకుని కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,738 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 


- సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలిస్ట్ ,టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి

Updated Date - 2021-08-02T06:02:23+05:30 IST