చిత్తూరు జిల్లాలో మందకొడిగా పోలింగ్

ABN , First Publish Date - 2021-04-08T20:22:23+05:30 IST

జిల్లాలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 30శాతం పోలింగ్ కూడా దాటలేదు.

చిత్తూరు జిల్లాలో మందకొడిగా పోలింగ్

చిత్తూరు: జిల్లాలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 30శాతం పోలింగ్ కూడా దాటలేదు. చాల పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక బోసిపోయినట్టు కనిపిస్తున్నాయి. టీడీపీ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో పోలింగ్ సరళిని గమనిస్తే పోలింగ్ శాతం తగ్గేపరిస్దితులు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 


జిల్లాలో మొత్తం 65 జడ్పీటీసీ, 901 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గతేడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో 30 జడ్పీటీసీ, 433 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 15 ఎంపీటీసీ స్థానాలు కుప్పం మున్సిపాలిటీ, బి.కొత్తకోట నగర పంచాయతీల్లో విలీనమవ్వగా.. 29 స్థానాలు కోర్టు కేసుల కారణంగా ఎన్నికలకు దూరమయ్యాయి. ఇక మిగిలిన 424 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థులు మరణించడంతో, 419 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 419 ఎంపీటీసీ స్థానాలకు 1040 మంది బరిలో ఉన్నారు.

Updated Date - 2021-04-08T20:22:23+05:30 IST