బాధ్యతలు స్వీకరించిన 6నెలల్లోనే కమలా హారిస్‌కు షాక్!

ABN , First Publish Date - 2021-08-02T17:44:52+05:30 IST

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు అమెరికన్లు షాక్ ఇచ్చారు. వీపీగా ఆమె తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని తేల్చిపడేశారు. ప్రస్తుతం ఇందకు సంబంధించిన ఆంశం అమెరికాలో హా

బాధ్యతలు స్వీకరించిన 6నెలల్లోనే కమలా హారిస్‌కు షాక్!

వాషింగ్టన్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు అమెరికన్లు షాక్ ఇచ్చారు. వీపీగా ఆమె తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని తేల్చిపడేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆంశం అమెరికాలో హాట్‌టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కమలా హారిస్.. అమెరికా ఉపాధ్యక్ష పదవిని అదిరోహించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె అధికారం చేపట్టి దాదాపు 6నెలలు గడిచిపోయాయి.



ఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్ వంటి స్థానిక మీడియా చేసిన సర్వేలో ఉపాధ్యక్షురాలిగా ఆమె పని తీరు అస్సలు బాగోలేదని మెజారిటీ ప్రజలు స్పష్టం చేశారు. తాజాగా జరిగిన రెండు సర్వేల్లో 46 శాతం మంది ప్రజలు మాత్రమే వీపీగా కమలా హారిస్ పనితీరును మెచ్చుకున్నట్టు తేలింది. దాదాపు 48శాతం మంది ప్రజలు ఆమె పనితీరుపై పెదవి విరిచారట. దీంతో 1970 తర్వాత బాధ్యతలు స్వీకరించిన ఆరునెలల్లోనే  అత్యంత తక్కువ ప్రజాధారణ పొందిన ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గుర్తింపు పొందారని అక్కడి మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అగ్రరాజ్య అధినేతగా బైడెన్ పనితీరు బాగుందని 51.3శాతం మంది ప్రజలు కితాబిచ్చారట. సుమారు 44.9శాతం మంది ప్రజలు బైడెన్ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. మిగిలిన ప్రజలు ఎటూ తేల్చుకోలేకపోయారని సర్వేలో వెల్లడైంది. 


Updated Date - 2021-08-02T17:44:52+05:30 IST