Abn logo
May 7 2021 @ 15:52PM

ఈ ఫొటోను ఉపయోగించుకుంటాను: పంజాబ్ ఆటగాడు పూరన్

ఈ ఏడాది ఐపీఎల్‌లో పేలవ ఫామ్‌తో సతమతమైన పంజాబ్ కింగ్స్ ఆటగాడు నికోలస్ పూరన్ వచ్చే ఏడాది సత్తా చాటుతానంటున్నాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన పూరన్ నాలుగు మ్యాచ్‌లలో డకౌటయ్యాడు. ఒక మ్యాచ్‌లో 9, మరో మ్యాచ్‌లో 19 పరుగులు చేశాడు. దీంతో అతడిని వెంటనే తొలగించాలంటూ పంజాబ్‌ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేశారు.


ఐపీఎల్ వాయిదా పడడంతో వెస్టిండీస్‌కు చెందిన పూరన్ స్వదేశానికి పయనమయ్యాడు. ఆ సందర్భంగా ఓ ట్వీట్ చేశాడు. `టోర్నీ వాయిదా పడడం, దాని వెనకున్న కారణాలు నా గుండెను బద్దలు చేస్తున్నాయి. కానీ, తప్పదు. మళ్లీ వస్తాను ఐపీఎల్. గతంలో కంటే మెరుగ్గా కనిపించేందుకు ఈ ఫొటోను స్ఫూర్తిగా వాడుకుంటాను. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండండ`ని ట్వీట్ చేశాడు. ఈ సీజన్‌లో తన వైఫల్యాన్ని ప్రతిబింబించే గణాంకాల ఫొటోను ట్వీట్‌కు జతచేశాడు. 


Advertisement