అది కత్తిమీద సామే!

ABN , First Publish Date - 2020-03-29T10:02:06+05:30 IST

ఒలింపిక్స్‌ నిర్వహణ తేదీలను నిర్ధారించడం కత్తిమీద సామేనని ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో అభిప్రాయపడ్డాడు. 2021లో ఏ నెలలో ఏ తేదీలలో...

అది కత్తిమీద సామే!

పారిస్‌: ఒలింపిక్స్‌ నిర్వహణ తేదీలను నిర్ధారించడం కత్తిమీద సామేనని ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో అభిప్రాయపడ్డాడు. 2021లో ఏ నెలలో ఏ తేదీలలో విశ్వక్రీడలు జరిపినా.. ఆ సమయం సవాలేనని అన్ని క్రీడా సమాఖ్యలు భావిస్తున్నాయని కో పేర్కొన్నాడు. అందరికీ ఆమోదయోగ్యమైన తేదీలను నిర్ణయించడం కష్టమేనన్నాడు. కాగా.. వాయిదా పడిన ఒలింపిక్స్‌ను చలికాలంలోనే జరపాలని క్రీడా సమాఖ్యలు సూచిస్తున్నాయి. తద్వారా జపాన్‌లో మండు వేసవిలో, ఉక్కపోతను తప్పించుకొనే వీలుంటుందని అంటున్నాయి.

Updated Date - 2020-03-29T10:02:06+05:30 IST