Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘డిగ్రీ’ కాలేజీల మూసివేత!

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): జీరో అడ్మిషన్లను నమోదుచేసిన ప్రైవేటు డిగ్రీ కాలేజీలను మూసేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కాలేజీలకు అనుమతుల విషయంలో ఏం చేయాలనే అంశంపై ఉన్నత విద్యా మండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి కాలేజీల అనుమతులను రద్దు చేయడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ ఏడాదిలో సున్నా అడ్మిషన్ల జాబితాలో సుమారు 50 డిగ్రీ కాలేజీలు ఉన్నట్టు గుర్తించారు. మరో 250 ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో  కేవలం 50లోపే విద్యార్థులు చేరారు. ఇలా సుమారు 300 కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య బాగా పడిపోయింది. గతేడాది 58 డిగ్రీ కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు నమోదయ్యాయి. వీటికి దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అవకాశం ఇవ్వలేదు. వరుసగా మూడేళ్లపాటు సున్నా అడ్మిషన్లు నమోదైన కాలేజీలను మూసేయాలని అధికారులు భావిస్తున్నారు.  

Advertisement
Advertisement